రేపే మరాఠా సీఎం ప్రకటన
ఏక్ నాథ్ షిండే కామెంట్స్
ముంబై – మహారాష్ట్ర ఆపద్దర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేశారు. ఆదివారం షిండే మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి డిసెంబర్ 2న సోమవారం ప్రకటన చేస్తారని చెప్పారు.
ముందస్తుగా ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం మంచి పద్దతి కాదన్నారు షిండే. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరగడం అనేది పూర్తి అబద్దమన్నారు.
ఒకవేళ అలా జరిగి ఉంటే మొత్తం 288 సీట్లలో గెలిచి ఉండే వాళ్లం కదా అని తిరుగు ప్రశ్నించారు ఏక్ నాథ్ షిండే. తాను సీఎం రేసు బరిలో లేనని ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం తన చేతుల్లో లేదన్నారు. ఇదంతా ఢిల్లీలోని బీజేపీ హై కమాండ్ ప్లేస్ లో ఉందన్నారు ఆపద్దర్మ ముఖ్యమంత్రి.