సీఎం ఏక్ నాథ్ షిండే షాకింగ్ కామెంట్స్
ఎక్కువ సీట్లు వస్తే సీఎం కావాలని లేదు
మహారాష్ట్ర – మరాఠా ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు వచ్చేశాయి. భారీ మెజారిటీని సాధించింది ఎన్డీయే కూటమి. భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలతో ముందంజలో ఉంది. ఇక పవార్ తో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న శివసేన పార్టీ చీఫ్ ఏక్ నాథ్ షిండే తో పాటు ఫడ్నవీస్ ఎవరు సీఎం అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల ఫలితాల అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం ఏక్ నాథ్ షిండే. మరో వైపు ఫడ్నవీస్ నివాసంలో కీలక సమావేశం జరిగింది. బీజేపీ అగ్ర నేతలు హాజరయ్యారు. ఆయనను సీఎం పదవి చేపట్టాలని కోరారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం ఏక్ నాథ్ షిండే. ఎక్కువ సీట్లు వచ్చినంత మాత్రాన ముఖ్యమంత్రి కావాలన్న రూల్ ఏమీ లేదన్నారు. కూటమి కీలక నేతలతో సమావేశం అయ్యాక ఎవరు సీఎంగా ఉండాలనేది తేలుతుందన్నారు సీఎం ఏక్ నాథ్ షిండే. ఇదిలా ఉండగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
మరో వైపు జార్ఖండ్ లో ఎన్డీయే కూటమి బోల్తా పడింది. అక్కడ మరోసారి జేఎంఎం , కాంగ్రెస్ కూటమి హవా కొనసాగించడం విశేషం. మోడీ, అమిత్ షా పాచికలు పారలేదు. చంపై సోరేన్ జిమ్మిక్కులు వర్కవుట్ కాలేదు.