NEWSNATIONAL

ప్ర‌జ‌లు న‌న్నే కోరుకుంటున్నారు – షిండే

Share it with your family & friends

ఆప‌ద్ద‌ర్మ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మ‌హారాష్ట్ర – రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి ఏక్ నాథ్ షిండే సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మ‌రాఠా ప్ర‌జ‌లు త‌న‌ను మ‌రోసారి సీఎంగా చూడాల‌ని అనుకుంటున్నారంటూ బాంబు పేల్చారు. ఇవాళ సీఎం ఎవ‌ర‌నే దానిపై ప్ర‌ధాన‌మంత్రి మోడీ క్లారిటీ ఇస్తార‌ని చెప్పిన షిండే ఉన్న‌ట్టుండి యూ ట‌ర్న్ తీసుకున్నారు.

అమిత్ షా, జేపీ న‌డ్డా, పీఎంతో జ‌రిగిన కీల‌క స‌మావేశంలో షిండేతో పాటు ఫ‌డ్న‌వీస్ , అజిత్ ప‌వార్ భేటీ అయ్యారు. ప‌లు ప్ర‌తిపాద‌న‌లు ముందు ఉంచినా దానికి నో చెప్పిన‌ట్లు స‌మాచారం. త‌న‌కు మ‌రోసారి సీఎం కావాల‌ని ఉంద‌ని పేర్కొన్నా ఈసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా ఆ పార్టీకి 132 సీట్స్ వ‌చ్చాయి.

బీజేపీకి సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని, డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ ప‌వార్ కు ఛాన్స్ ఇస్తామ‌ని ఇప్ప‌టికే రాజీ ఫార్మూలా ప్ర‌తిపాదించారు అమిత్ షా. దీనికి ఒప్పుకోని షిండే అన్ని కార్య‌క్ర‌మాల‌ను బంద్ చేసుకుని త‌న స్వంత ఊరుకు వెళ్లి పోయారు. ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నున్న త‌రుణంలో త‌న‌ను ప్ర‌జ‌లు సీఎంగా చూడాల‌ని అనుకుంటున్న‌ట్లు పేర్కొన‌డం క‌ల‌క‌లం రేపుతోంది.