నేను సీఎం అవుతానని అనుకోలేదు
ఏక్ నాథ్ షిండే షాకింగ్ కామెంట్స్
మహారాష్ట్ర – మహారాష్ట్ర ఆపద్దర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తన జీవితంలో ఎన్నడూ ముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదన్నారు. కలలో కూడా అది నెరవేరుతుందని కోరుకోలేదన్నారు . నేను అత్యంత పేదరికం నుంచి వచ్చానని స్పష్టం చేశారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో మహాయుతి కూటమికి అత్యధికంగా సీట్లు కట్ట బెట్టారని, వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ విజయం తమది కాదని మరాఠా ప్రజలందరి విజయమని చెప్పారు ఏక్ నాథ్ షిండే. ఈ సందర్బంగా మాట్లాడుతుండగానే ఏక్ నాథ్ షిండే భావోద్వేగానికి లోనయ్యారు.
పేదల కష్టాలు, బాధలు తనకు తెలుసు అన్నారు. తాను ఆటో డ్రైవర్ స్తాయి నుంచి ఇవాళ సీఎం పదవి నిర్వహించేంత దాకా ఎన్నో ఎత్తు పల్లాలను చూశానని చెప్పారు. మరాఠా యోధుడు బాల్‌థాక్రే ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేశానని అన్నారు . తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మద్దతు ఉందన్నారు.
మహాయుతి గెలుపు కోసం కార్యకర్తలా పనిచేశానని చెప్పారు.. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానని అన్నారు.