ఏక్తా కపూర్..తల్లిపై ఫోక్సో కేసు నమోదు
గాండీ బాత్ ఎపిసోడ్ లో అసభ్యకర దృశ్యాలు
ముంబై – ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్, తల్లికి బిగ్ షాక్ తగిలింది. ఈ ఇద్దరిపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆదివారం పోలీసులు వెల్లడించారు. గాండీ బాత్ పేరుతో ఓటీటీ ప్లాట్ ఫారమ్ వేదికగా సీరీస్ తీశారు ఏక్తా కపూర్. తన స్వంత కంపెనీ బాలాజీ వెబ్ సీరీస్ పేరుతో దీనిని తీశారు. గాండీ బాత్ ఎపిసోడ్ లో మైనర్ బాలికలకు సంబంధించి అసభ్యకరమైన దృశ్యాలు చూపించారని ఆరోపణలు ఉన్నాయి.
ఇందుకు సంబంధించి ఏక్తా కపూర్, తల్లి శోభా కపూర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిపై ఫోక్సో చట్టం కింద ఫిర్యాదు చేశారు. గాండీ బాత్ వెబ్ సీరీస్ ఆరు సీజన్లు విడుదలయ్యాయి. ఈ సీరీస్ ను నిషేధించాలని పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేశారు కొందరు.
ముంబై లోని ఎంహెచ్ బీ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 295-ఏ, ఐటీ చట్టం, పోక్సో చట్టం లోని సెక్షన్ 13, 15 కింద మైనర్ బాలికలను అసభ్యకరంగా చూపించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ వివాదాస్పద ఎపి సోడ్ ప్రస్తుతం బాలాజీ యాప్ లో ప్రసారం కాక పోవడం విశేషం. అయితే ఇందులో నటించిన వారు మైనర్లు కాదని మేజర్లు అని పేర్కొన్నారు ఏక్తా కపూర్, శోభా కపూర్.
అయితే డిస్ క్లైమర్ ఇవ్వకుండా సిగరెట్, తాగే దృశ్యాలను చూపించారని ఫిర్యాదుదారుడు ఆరోపించారని పోలీసులు తెలిపారు.