Wednesday, April 9, 2025
HomeDEVOTIONALరేప‌టి నుంచి భ‌వానీ దీక్ష‌ల విర‌మ‌ణ

రేప‌టి నుంచి భ‌వానీ దీక్ష‌ల విర‌మ‌ణ

క‌న‌క‌దుర్గ ఆల‌యంలో విస్తృత ఏర్పాట్లు

అమ‌రావ‌తి – ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రం విజ‌య‌వాడ‌లోని క‌న‌క దుర్గ‌మ్మ ఆల‌యం భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. అమ్మ వారిని ద‌ర్శించుకునేందుకు బారులు తీరారు. త‌మ మొక్కులు తీర్చుకునేందుకు క్యూ క‌ట్టారు.

ఇదిలా ఉండ‌గా కనక దుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈనెల 21 నుంచి 25 వరకు భవాని దీక్ష విరమణలు ఉంటాయని వెల్ల‌డించారు ఈవో రామారావు. సుప్రభాత సేవ అయిన అనంతరం దీక్ష విరమణ ప్రారంభం అవుతుందని తెలిపారు.

భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని స్ప‌ష్టం చేశారు. అన్ని ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి ఉన్నాయని అన్నారు. భక్తులందరికీ ఉచితంగా దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు.

ఉదయం 6 గంటలకు దీక్ష విరమణ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. సుమారు భక్తులు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది వస్తారని అన్నారు. భక్తులకు లడ్డూలు కూడా అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

ప్రస్తుతం ఐదు లక్షల లడ్డూలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. భవానీ దీక్షలు 2024 యాప్ కూడా ప్రవేశ పెట్టామని అన్నారు. యాప్ లోనే లడ్డూలు కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.

యాప్‌లో లడ్డూలు బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. యాప్ ద్వారా అన్ని సదుపాయాలు పొందే అవకాశం ఉందని అన్నారు. యాప్లో గిరి ప్రదక్షిణ మ్యాప్ ను కూడా సూచిస్తున్నామని తెలిపారు. వీఐపీ దర్శనాలు, అంతరాలయ దర్శనాలు రద్దు చేశామని ప్ర‌క‌టించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments