Tuesday, April 22, 2025
HomeNEWSNATIONALబాండ్ల బండారం బ‌ట్ట‌బ‌య‌లు

బాండ్ల బండారం బ‌ట్ట‌బ‌య‌లు

రూ. 11,675 కోట్ల విరాళాలు

న్యూఢిల్లీ – సుప్రీంకోర్టు దెబ్బ‌కు అస‌లు బండారం బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డంతో దేశ వ్యాప్తంగా 143 కోట్లాది ప్ర‌జ‌లు విస్తు పోయారు. దేశంలోని బ‌డా బాబులు, కార్పొరేట్ కంపెనీలు, పారిశ్రామిక‌వేత్త‌లు, అక్ర‌మార్కులు పెద్ద ఎత్తున ఆయా పార్టీల‌కు ఎల‌క్టోర‌ల్ బాండ్ల రూపేణా విరాళాలు అంద‌జేశారు.

ఒక్క భార‌తీయ జ‌న‌తా పార్టీకి భారీ ఎత్తున నిధులు వ‌ర‌ద‌లా వెల్లువెత్తాయి. ఆ ఒక్క పార్టీకి రూ. 6,041 వేల కోట్ల‌కు పైగా విరాళాలు ద‌క్కాయి. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీకి అందాయి. మెగా కృష్ణా రెడ్డి ఏకంగా 963 కోట్లు విరాళంగా ఇవ్వ‌డం చ‌ర్చ నీయాంశంగా మారింది. ఒక్క బీఆర్ఎస్ పార్టీకి రూ. 1215 కోట్లు బాండ్ల రూపేణా వ‌చ్చాయి. వైసీపీకి 333 కోట్లు , టీడీపీకి రూ. 217 కోట్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా అవుతుంది.

భారీ ఎత్తున నిధులు ఇచ్చిన కంపెనీల‌లో ఫార్మా, లాజిస్టిక్ కంపెనీలు కూడా ఉన్నాయి. అపోలో టైర్స్ , ల‌క్ష్మీ మిట్ట‌ల్ , ఎడెల్వీస్ , పీవీఆర్ , కెవెంట‌ర్ , సులా వైన్ , వెల్స్ప‌న్ , స‌న్ ఫార్మా ఉండ‌డం విశేషం. కేంద్ర ఎన్నిక‌ల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు ఎస్బీఐ అంద‌జేసిన మొత్తం వివ‌రాల‌ను త‌న ఎన్నిక‌ల వెబ్ సైట్ లో పొందు ప‌ర్చింది.

ఎల‌క్టోర‌ల్ బాండ్ల పేరుతో విరాళాలు వ‌సూలు చేయ‌డం రాజ్యాంగానికి విరుద్ద‌మ‌ని, అందుకే దీనిని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది భార‌త దేశ అత్యున్న‌త న్యాయ స్థానం. ఎయిర్ టెల్ , మేఘా ఇంజ‌నీరింగ్ , టోరెంట్ ప‌వ‌ర్ , డీఎల్ఎఫ్ క‌మ‌ర్షియ‌ల్ డెవ‌ల‌ప‌ర్స్ , వేదాంత లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే అదానీ గ్రూప్ , రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ కు సంబంధించి వివ‌రాలు లేక పోవ‌డం అనుమానం క‌లిగిస్తంది.

పార్టీల ప‌రంగా చూస్తే భార‌తీయ జ‌న‌తా పార్టీ, బీఆర్ఎస్ , శివ‌సేన‌, డీఎంకే, టీడీపీ, వైసీపీ, ఏఐడీఎంకే, జేడీఎస్ , ఎన్సీపీ, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, ఆప్ , ఎస్పీ ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments