ప్రియాంక గాంధీ మెజారిటీ 4,10,931 ఓట్లు
వాయనాడు ఎన్నికల చరిత్రలో రికార్డ్
కేరళ – ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అరుదైన ఘనత సాధించారు. కేరళలోని వాయనాడు లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఊహించని రీతిలో భారీ మెజారిటీని సాధించారు. ఏకంగా 4,10,931 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తన సోదరుడు , ఏఐసీసీ మాజీ చీఫ్ , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ ఇక్కడి నుండి పోటీ చేసి గెలుపొందారు.
ఆయన వాయనాడుతో పాటు రాయ్ బరేలి రెండు చోట్లా పోటీ చేశారు. రెండు ఎంపీ సీట్లలో గెలుపొందారు. రాహుల్ గాంధీకి 3,64,000 ఓట్లు వచ్చాయి. ఇదిలా ఉండగా రెండు ఎంపీ సీట్లకు గాను తాను వాయనాడ్ ను వదుకుంటున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో తనను ఆదరించినందుకు గాను తన సోదరి ప్రియాంక గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేస్తుందని ప్రకటించారు.
ఈ మేరకు హోరా హోరీగా సాగుతుందని భావించారు అంతా. కానీ ఊహించని రీతిలో వాయనాడు ఉప ఎన్నిక ఏకపక్షంగా సాగింది. భారీ మెజారిటీని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. ప్రియాంక గాంధీకి మొత్తం 6,22,338 ఓట్లు వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ప్రియాంక గాంధీ తన సమీప ప్రత్యర్థి సత్యన్ మోకరీపై గ్రాండ్ విక్టరీ సాధించారు.