ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్
7 విడతలో దేశంలో ఎలక్షన్ జరిగే ఛాన్స్
న్యూఢిల్లీ – దేశంలో ఎప్పుడైనా ఎన్నికల నగారా మోగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో ఈసీ బృందం పర్యటించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో పర్యటించారు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.
ఇదిలా ఉండగా దేశంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలలో సత్తా చాటేందుకు సిద్దమయ్యాయి. ఈసీ సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా సార్వత్రిక (పార్లమెంట్) ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను ఖరారు చేయనున్నట్లు సమాచారం.
7 విడతలలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలని, ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేసినట్లు టాక్. ఇప్పటికే ఓటర్ల జాబితాలను ప్రచురించాలని ఈసీ ఆదేశించింది. దీంతో ఎన్నికల నగారా మోగేందుకు సిద్దమైందన్నమాట.
ఈసారి బీజేపీ వర్సెస్ ఇండియా కూటమిలోని పార్టీలు పోటీ పడనున్నాయి. ఆయా పార్టీలతో సమావేశం నిర్వహించింది ఎన్నికల సంఘం. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంది. ఈసారి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.