సుప్రీం దెబ్బకు దిగొచ్చిన ఎస్బీఐ
ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు సమర్పణ
న్యూఢిల్లీ -భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు దెబ్బకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగి వచ్చింది. ఇక తమ ఆటలు సాగవని గుర్తించింది. కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ కు ఊడిగం చేస్తూ , పీఎం చెప్పినట్లు ఆటాడుతూ వచ్చిన ఎస్బీఐకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే దొడ్డి దారిన కోట్లాది రూపాయలను దండుకునేందుకు ప్లాన్ చేసింది పవర్ లోకి వచ్చిన వెంటనే.
దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలో ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి చట్టాన్ని తీసుకు వచ్చింది. ఈ దేశానికి చెందిన వారు లేదా ప్రవాస భారతీయులు ఎన్ని కోట్లు అయినా సరే ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయొచ్చంటూ ప్రకటించింది. దీనికి చట్టబద్దత తీసుకు వచ్చింది బీజేపీ సర్కార్.
దీంతో వేల కోట్ల రూపాయలు వచ్చి చేరాయి పవర్ లో ఉన్న భారతీయ జనతా పార్టీకి. బీజేపీతో పాటు ఇతర పార్టీలకు కూడా గంప గుత్తగా కోట్లాది రూపాయలు వచ్చి పడ్డాయి. వీటికి సంబంధించి గోప్యత పాటిస్తామని, వివరాలు వెల్లడించేందుకు వీలు లేదంటూ చట్టంలో పేర్కొంది.
దీనిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలు, మోసగాళ్లు పెద్ద మొత్తంలో చెల్లించారు. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని, కానీ ఎవరు చెల్లించారనే దానికి సంబంధించి వివరాలు ఇవ్వాల్సిందేనంటూ కోరింది.
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ధనంజయ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్స్ చెల్లవని, వెంటనే నిలిపి వేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో ఇప్పటి వరకు చెల్లించిన వారి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. దీనికి నాలుగు నెలల పాటు గడువు కోరింది ఎస్బీఐ. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 12న సాయంత్రం లోపు వివరాలను ఇవ్వాలని లేక పోతే కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని హెచ్చరించింది. దీంతో హుటా హుటిన జాబితాను కోర్టుకు సమర్పించింది.