ఎస్బీఐపై సుప్రీంకోర్టు సీరియస్
పూర్తి వివరాలు ఇవ్వలేదని ఫైర్
న్యూఢిల్లీ – భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం (సుప్రీంకోర్టు) సీరియస్ అయ్యింది. శుక్రవారం ఎలోక్టరల్ బాండ్స్ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది మరోసారి. సుదీర్ఘ విచారణ అనంతరం ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినా ఎందుకని పూర్తి వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వలేదంటూ నిలదీసింది.
కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే ఇవ్వడం, వాటికి సంబంధించి ఏయే పార్టీకి ఎన్నెన్ని విరాళాలు వచ్చాయనే దానికి సంబంధించి పూర్తి వివరాలు ఎందుకు ఇవ్వలేక పోయిందంటూ మండిపడింది ధర్మాసనం.
పూర్తి వివరాలు అందించడంలో ఎందుకు ఆలస్యం జరిగిందనటూ ఫైర్ అయ్యింది సుప్రీంకోర్టు. ఇందుకు సంబంధించి ఎస్బీఐకి నోటీసులు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది ధర్మాసనం.
ఇదిలా ఉండగా ఇదే కేసుకు సంబంధించి ఈనెల 15 వ తేదీ లోపు మొత్తం ఎలక్టోరల్ బాండ్ల వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని ఆదేశించింది. అయితే వివరాలు ఇచ్చిన ఎస్బీఐ ఏయే పార్టీలకు ఎవరెవరు, ఏయే కంపెనీలు ఇచ్చాయనే దాని గురించి ఇవ్వక పోవడాన్ని తప్పు పట్టింది కోర్టు.