NEWSINTERNATIONAL

ఓటింగ్ విధానం లోప భూయిష్టం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఎలోన్ మ‌స్క్

అమెరికా – టెస్లా చైర్మ‌న్ , ఎక్స్ సీఈవో ఎలోన్ మ‌స్క్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో మాజీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ కు బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఈ సంద‌ర్బంగా పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా చేప‌ట్టారు. ఇందులో భాగంగా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఓటింగ్ విధానంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

ప్ర‌ధానంగా బీటీడ‌బ్ల్యూ కొల‌రాడోలో ఓటింగ్ సిస్ట‌మ్స్ కోసం పాస్ వ‌ర్డ్ ల‌ను లీగ్ చేసిన మ‌హిళ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ట్రంప్ ను బ్యాలెంట్ నుండి తొలగించేందుకు ప్ర‌య‌త్నించిన విష‌యాన్ని గుర్తు చేశారు.

డెమోక్రటిక్ కొలరాడో సెక్రటరీ ఆఫ్ స్టేట్ జెనా గ్రిస్‌వోల్డ్ కార్యాలయం “అనుకోకుండా” కొలరాడో ఓటింగ్ సిస్టమ్‌ల కోసం ఆన్‌లైన్‌లో పాస్‌వర్డ్‌లను పోస్ట్ చేసింది. ఈ పాస్‌వర్డ్‌లు నెలల తరబడి అందుబాటులో ఉన్నాయ‌ని, ఇవి యాక్టివ్ ఓటింగ్ సిస్టమ్‌లతో ముడిపడి ఉన్నాయని ఆరోపించారు ఎలోన్ మ‌స్క్.

కానీ డెమోక్రాట్లు ఓటరు మోసం అసాధ్యమని, త‌మ‌కు అత్యంత సురక్షితమైన ఎన్నికలు ఉన్నాయని చెప్పారు.