BUSINESSTECHNOLOGY

స్టార్ లింక్ డైరెక్ట్ టు లింక్

Share it with your family & friends

ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ క‌ల‌క‌లం

అమెరికా – ప్ర‌పంచ టెలికాంలో సంచ‌లనం రేపుతోంది స్టార్ లింక్. ఇప్ప‌టికే విద్యుత్ కార్ల త‌యారీలోను, ఇక ప్ర‌పంచాన్ని సామాజిక వేదిక ఎక్స్ ద్వారానూ దుమ్ము రేపుతున్నారు టెస్లా చైర్మ‌న్ , ఎక్స్ సీఈవో, స్టార్ లింక్ వ్య‌వ‌స్థాప‌కుడు , ప్ర‌పంచ కుబేరుడైన ఎలోన్ మ‌స్క్. త‌న ల‌క్ష్యం ఒక్క‌టే ప్ర‌పంచంలో ఎక్క‌డున్నా ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ ఉండాల‌నేది. అంతే కాదు రోద‌సీలో కూడా మ‌నుషులు నివ‌సించేలా చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు.

త‌నకు ఆలోచ‌న‌లు వ‌చ్చాయంటే చాలు ఇక దానిని ఆచ‌ర‌ణ‌లోకి తీసుకు వ‌చ్చేంత దాకా వ‌దిలి పెట్ట‌డు ఎలోన్ మ‌స్క్. ఇప్ప‌టికే ప‌లు ఉప‌గ్ర‌హాల‌ను త‌యారు చేశాడు. స్టార్ లింక్ క‌నెక్టివిటీని ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ వ‌ర‌ల్డ్ మార్కెట్ మొత్తం త‌న గుప్పిట్లోకి తీసుకు రాబోతున్నాడు.

తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. స్టార్ లింక్ డైరెక్ట్ టు సెల్ (డీటీసీ) గ్లోబ‌ల్ అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధాన టెల్కోలు జ‌త క‌ట్టిన‌ట్లు తెలిపాడు ఎలోన్ మ‌స్క్. క‌నెక్టివిటీని విప్ల‌వాత్మ‌కంగా మార్చేందుకు స్టార్ లింక్ సిద్ద‌మైంద‌ని స్ప‌ష్టం చేశారు.