ఎక్స్ న్యూస్ యాప్ నెంబర్ వన్
యాప్ స్టోర్ లో కెనడాలో టాప్
అమెరికా – టెస్లా చైర్మన్ , స్పేస్ ఎక్స్ సీఈవో, ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కు చెందిన ఎక్స్ న్యూస్ యాప్ నెంబర్ వన్ గా నిలిచింది. యాప్ ప్లే స్టోర్ లో ఏకంగా అత్యధికంగా ఎక్స్ న్యూస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. అంతే కాకుండా ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ ప్లాట్ ఫారం మీదుగా ఈ విషయాన్ని సగర్వంగా ప్రకటించారు ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్.
కెనడాలో ఎక్స్ ( X ) నంబర్ వన్ ఉచిత వార్తల అప్లికేషన్‌గా మారిన తర్వాత పెద్ద ఎత్తున దీనిని ఆదరించడం మొదలు పెట్టారు. అంతే కాకుండా ఎక్స్ ద్వారా అమెరికా ఎన్నికల ప్రచారంలో బేషరతుగా ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలలో బంపర్ మెజారిటీ సాధించిన డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు ఇచ్చారు ఎలాన్ మస్క్.
ఆయన ప్రధానంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయన మెయిన్ స్ట్రీమ్ ఈడియాను ఏకి పారేశారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరు తన ఎక్స్ మాధ్యం ద్వారా వ్యక్తిగత, మాట్లాడే స్వేచ్ఛకు ప్రయారిటీ ఇస్తున్నట్లు ప్రకటించారు ఎలాన్ మస్క్. దీంతో ఊహించని రీతిలో ఎక్స్ ఇప్పుడు టాప్ లో కొనసాగుతోంది.
నెటిజన్లు లేదా ప్రజలు ఎవరైనా సరే కులం, మతం, వర్గం , జాతి అన్న తేడా లేకుండా తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకునేలా తన ఎక్స్ వేదికను తీర్చి దిద్దడం జరిగిందని స్పష్టం చేశారు ఎలాన్ మస్క్.
కాగా ఎక్స్ న్యూస్ యాప్ నెంబర్ 1గా నిలవడం పట్ల ఆనందాన్ని పంచుకున్నారు ప్రత్యేకంగా మస్క్.