NEWSINTERNATIONAL

స్వేచ్ఛ‌కు ఎక్స్ జై – ఎలాన్ మ‌స్క్

Share it with your family & friends

నిర్భ‌యంగా ఆలోచ‌న‌లు పంచుకోండి

అమెరికా – టెస్లా చైర్మ‌న్, ఎక్స్ అధినేత ఎలాన్ మ‌స్క్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తాజాగా అమెరికాలో జ‌రిగిన ఎన్నిక‌ల‌లో ప్ర‌ధానంగా స్వేచ్ఛ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌వాల్సిన మీడియా ప‌నిగ‌ట్టుకుని అధికారంలో ఉన్న వారికి మ‌ద్ద‌తుగా నిలిచింద‌ని ఆరోపించారు. దీనిపైనే ఆయ‌న ఎక్కువ‌గా స్పందించారు.

మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోష‌ల్ మీడియా, డిజిట‌ల్ మీడియాలో చోటు చేసుకున్న మార్పుల గురించి ప్ర‌స్తావించారు. ఎన్నిక‌లు అయి పోయాయి. ఎవ‌రు ఏమిటో, ఎవ‌రి వైపున ఉన్నారో తేలి పోయింద‌న్నారు ఎలాన్ మ‌స్క్. ఆయ‌న బేష‌ర‌తుగా డొనాల్డ్ ట్రంప్ కు మ‌ద్ద‌తు తెలిపారు. ఆయ‌న త‌ర‌పున గెలుపొందేందుకు విస్తృతంగా ప్ర‌చారం చేశారు.

చివ‌ర‌కు ఎలాన్ మ‌స్క్ అనుకున్న‌ది సాధించారు. ఇదే విష‌యం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు త‌న ప్ర‌సంగంలో నూత‌న దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే లెగ‌సీ మీడియా ప్ర‌జ‌ల‌కు అబ‌ద్దాలు చెప్పే ప్ర‌య‌త్నం చేసింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఎలాన్ మ‌స్క్.

ఈ సంద‌ర్భంగా ఎక్స్ గురించి పేర్కొన్నారు. ఎవ‌రైనా స‌రే ప్ర‌పంచ వ్యాప్తంగా ఆలోచ‌న‌లు, అభిప్రాయాల‌ను పంచు కోవాల‌ని కోరారు . స‌త్యాన్ని క‌నుగొన‌గ‌లిగే ప్ర‌పంచంలో క‌నీసం ఒక్క ప్ర‌దేశ‌మైనా మీరు క‌లిగి ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు.