ట్రంప్ కు మద్దతు ఇవ్వండి – ఎలోన్ మస్క్
టెస్లా చైర్మన్..ట్విట్టర్ ఎక్స్ సీఈవో కామెంట్స్
అమెరికా – ఎలోన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందిన ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ టెస్లా కు చైర్మన్ గా ఉన్నారు. అంతే కాదు ప్రపంచాన్ని నిత్యం ప్రభావితం చేస్తూ కోట్లాది మందిని పాలు పంచుకునేలా, అభిప్రాయాలను నిర్భయంగా వెలిబుచ్చేందుకు ఏర్పాటైన సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ ఎక్స్ కు సీఈఓగా ఉన్నారు. ఇది పక్కన పెడితే ప్రతి రోజూ తన అభిప్రాయాలను పంచు కోవడం అలవాటు ఎలోన్ మస్క్ కు.
ఆయన ముందు నుంచీ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు ఇస్తూ వస్తున్నారు. బైడెన్ ప్రభుత్వాన్ని ఏకి పారేస్తున్నారు. ఇది తన స్వంత అభిప్రాయమని, ఇతరుల అభిప్రాయాలతో తాను గౌరవిస్తానని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు మంగళవారం ఎలోన్ మస్క్ తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో. ఈ సందర్బంగా అమెరికాలో ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు బలమైన నాయకుడు అవసరమని, ఇందుకు గాను డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు ఇవ్వాలని కోరారు ఎలోన్ మస్క్.