వాస్తవ సమాచారాన్ని పంచుకోండి – మస్క్
నెటిజన్లకు కీలక సూచనలు చేసిన ఎలోన్
అమెరికా – టెస్లా చైర్మన్, ఎక్స్ సీఈఓ, ఎండీ ఎలోన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రతి అంశాన్ని పంచుకోవడం ఆయన దినచర్యల్లో భాగం. ఆయన నేరుగా తన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటారు. ఇది తన జీవితంలో భాగమై పోయిందని పేర్కొన్నారు ఈ దిగ్గజ వ్యాపార వేత్త.
అయితే 119 మిలియన్లకు పైగా ఎలోన్ మస్క్ ను ఎక్స్ వేదికగా ఆయన ఖాతాను అనుసరిస్తున్నారు. ఇక మిగతా సామాజిక మాధ్యమాలలో సైతం ట్రెండ్ సృష్టించారు. ఈ సందర్బంగా తాను ఎందుకు ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నానే దానిపై కూడా ఆ మధ్యన వివరణ ఇచ్చారు.
విచిత్రం ఏమిటంటే ప్రస్తుతం అమెరికాలో కొలువు తీరిన బైడన్ ప్రభుత్వాన్ని ఏకి పారేస్తున్నారు. నేరుగా తన ఎక్స్ వేదికగా సంచలన కామెంట్స్ చేస్తూ హోరెత్తిస్తున్నారు ఎలోన్ మస్క్. ఇదే సమయంలో ఆయన బహిరంగంగానే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు పలుకుతుండడం విశేషం.
ఇదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సెన్సేషన్ కోసమో లేదా వ్యూయర్ షిప్ పెంచుకునేందుకో దయచేసి తమ ఆలోచనలు, అభిప్రాయాలను , సమాచారాన్ని ఎక్స్ లో షేర్ చేయొద్దంటూ సూచించారు.
ప్రజలకు, దేశానికి, ప్రపంచానికి, సమాజానికి మేలు చేకూర్చేలా ఏదైనా ఉండాలని పేర్కొన్నారు ఎలోన్ మస్క్. వాస్తవా సమాచారాన్ని పంచుకునేందుకు ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు దిగ్గజ వ్యాపారవేత్త.