టిక్ టాక్ కొనాలా వద్దా..?
అభిప్రాయం కోరిన మస్క్
అమెరికా – ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెస్లా చైర్మన్, ట్విట్టర్ సీఈవో, స్టార్ లింక్ ఫౌండర్ ఎలాన్ మస్క్ సంచలనంగా మారారు. ప్రస్తుతం ఆయన ప్రముఖ సామాజిక దిగ్గజం ట్విట్టర్ (పిట్ట కూత)కు చికిత్స చేస్తున్నారు. ఎవరూ ఊహించని రీతిలో దానిని కొనుగోలు చేశారు. చాలా మంది ఉద్యోగులను తొలగించాడు. పని చేసే వారికే పట్టం కడతానని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం ట్విట్టర్ గాడిలో పడింది. కానీ అందరి మెడల మీద కత్తులు వేలాడుతున్నాయి.
ఇదిలా ఉండగా ప్రతి రోజూ ఏదో ఒక అంశంతో ముందుకు రావడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు ఎలోన్ మస్క్. ఇవాళ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మీరంతా విలువైన అభిప్రాయాన్ని పంచు కోవాలని కోరాడు ఎలాన్ మస్క్.
ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది సోషల్ మీడియా టిక్ టాక్. ఇది చైనాకు చెందిన సంస్థ. దీనిని పలు దేశాలలో నిషేధం విధించారు. షార్ట్ స్టోరీస్, రీల్స్ చేయడంలో టాప్ లో కొనసాగుతోంది ఇప్పటికి కూడా. ఈ సందర్బంగా మస్క్ ఓ కీలక ప్రకటన చేశాడు. అదేమిటంటే తాను టిక్ టాక్ ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. దీనికి మీరేమంటారంటూ ప్రశ్నించాడు.