BUSINESSTECHNOLOGY

ట్విట్ట‌ర్ యాప్ లోగో కెవ్వు కేక‌

Share it with your family & friends

మ‌న‌సు దోచేస్తున్న పిట్ట కూత
అమెరికా – టెస్లా చైర్మ‌న్ , ట్విట్ట‌ర్ సీఈవో ఎలోన్ మ‌స్క్ ఏది చేసినా అది సంచ‌ల‌న‌మే. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ట్విట్ట‌ర్ ను టేకోవ‌ర్ చేసుకున్నారు. అంతా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగతించ లేదు. కానీ ఇప్పుడు ట్విట్ట‌ర్ ను ఎక్స్ గా మార్చేశాడు. ఎప్ప‌టిక‌ప్పుడు కీల‌క మార్పులు తీసుకు వ‌స్తున్నాడు.

ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది ట్విట్ట‌ర్ తో అనుసంధాన‌మై ఉన్నారు. ఎక్క‌డ ఏమూల‌లో ఏం జ‌రిగినా క్ష‌ణాల‌లో ట్విట్ట‌ర్ పై ప్ర‌త్య‌క్షం అవుతోంది. కోట్లాది మంది ట్విట్ట‌ర్ ను ఉప‌యోగిస్తున్నారు. త‌మ ఆలోచ‌న‌ల‌ను, అభిప్రాయాల‌ను పంచుకుంటున్నారు. మ‌రికొంద‌రు త‌మ‌కు తోచిన మేర క్రియేటివీటీకి అద్దం ప‌ట్టేలా వాడుతున్నారు.

ఇది ప‌క్క‌న పెడితే తాజాగా ఎలోన్ మ‌స్క్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు త‌న ట్విట్ట‌ర్ ఎక్స్ ఖాతా ద్వారా అరుదైన ఫోటోను పంచుకున్నారు. ట్విట్ట‌ర్ యాప్ లోగోను మారుస్తున్న‌ట్లు తెలిపారు. కొత్త‌గా త‌యారు చేసిన లోగోను షేర్ చేశారు. ఇది మీకు న‌చ్చిందా అంటూ పేర్కొన్నారు. ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌స్తూనే ఉన్నాయి. ఎంతైనా మ‌స్కా మ‌జాకా అంటున్నారు నెటిజ‌న్లు.