ప్రపంచ లీడర్లకు మస్క్ బంపర్ ఆఫర్
ఇక పీఆర్ బృందాలకు చెక్ చెప్పండి
అమెరికా – అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన ఎక్స్ చీఫ్ , టెస్లా చైర్మన్ ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇక నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లీడర్లందరూ తాము ప్రజా సంబంధాలను నిర్వహించే బృందాలను పక్కన పెట్టాలని సూచించారు.
ఆ పని ఎలాంటి ఖర్చు లేకుండానే తమ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసుకోవచ్చని స్పష్టం చేశారు ఎలాన్ మస్క్. మీ అభిప్రాయాలను, ఆలోచనలను, సూచనలను, సేవ చేయాలని అనుకునే వారికి, ఆలోచనాపరులకు, లీడర్లకు, మేధావులకు, ఆంట్రప్రెన్యూర్లకు, క్రీడాకారులకు, సెలబ్రిటీలకు, దేశాధినేతలకు, ప్రధానమంత్రులకు..టెక్కీలకు ఎక్స్ వేదికగా ఉపయోగ పడుతుందని తెలిపారు .
నేను సాధారణంగా ప్రపంచ నాయకులకు మీ స్వంత అంశాలను అక్షరాలా పోస్ట్ చేయమని సిఫార్సు చేస్తాను. ఒక్కోసారి తప్పు చేస్తుంటారు. దాని గురించి చింతించకండి. వారందరినీ గెలవలేమన్నారు మస్క్.