ఎలోన్ మస్క్ సెల్యూట్
వెల్ డన్ అమెరికా వైరల్
అమెరికా – టెస్లా చైర్మన్, స్పేస్ ఎక్స్ సీఈవో, ఎక్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎలోన్ మస్క్ వైరల్ గా మారారు. అమెరికా దేశంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ కు ఆయన బేషరతు మద్దతు పలికారు. అంతే కాదు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
తానే స్వయంగా పాల్గొన్నారు. డెమోక్రటిక్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. అంతే కాదు తన సంస్థకు చెందిన సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్రంప్ కు ఊహించని రీతిలో ప్రచారం నిర్వహించారు.
ఎవరూ ఊహించని రీతిలో యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన అమెరికా ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. డొనాల్డ్ ట్రంప్ అద్భుత విజయాన్ని సాధించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రత్యేకంచి డొనాల్డ్ ట్రంప్ చాలా సేపు తన స్నేహితుడు ఎలోన్ మస్క్ గురించి ప్రస్తావించారు. ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. తను అందించిన తోడ్పాటు, మద్దతు తాను మరిచి పోలేదనని, ఐ లవ్ హిమ్ అంటూ కితాబు ఇచ్చారు దేశ అధ్యక్షుడు.
ఈ సందర్బంగా బుధవారం ఎక్స్ వాల్ పై అరుదైన ఫోటోను పంచుకున్నారు ఎలోన్ మస్క్. అమెరికా జాతీయ పతాకానికి ఆయన సెల్యూట్ చేశారు. ప్రస్తుతం షేర్ చేసిన ఈ చిత్రం వైరల్ గా మారింది. ఎంతైనా మస్కా మజాకా అంటున్నారు నెటిజన్లు.