ఎలోన్ మస్క్ ను చూస్తే గర్వంగా ఉంది
ప్రశంసలు కురిపించిన తల్లి మయే మస్క్
అమెరికా – ప్రపంచ వ్యాపార దిగ్గజం టెస్లా చైర్మన్, ఎక్స్ సీఈవో, ఎండీ ఎలోన్ మస్క్ పై ప్రశంసలు కురిపించింది స్వంత తల్లి మయే మస్క్. సోమవారం ఎక్స్ వేదికగా ఆమె తన అభిప్రాయాలను పంచుకుంది. ప్రస్తుతం యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోంది అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి.
ఎలోన్ మస్క్ పూర్తిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు ఇస్తున్నారు. ఆయన తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్బంగా తన తనయుడు చేస్తున్న ప్రచారం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
తనను చూస్తే తనకు గర్వంగా ఉందన్నారు మయే మస్క్. అమెరికాకు అన్ని వైపుల నుంచి తన పరంగా సహాయ సహకారాలు అందజేయడం పట్ల అభినందనలతో ముంచెత్తారు. అమెరికా దివాళా తీయడాన్ని నిరోధించడమే ఎలోన్ మస్క్ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు తల్లి.
మనందరం డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే అమెరికా దేశ భవిష్యత్తు కోసం. ఆర్థిక పరంగా మరింత ముందుకు సాగేందుకు ఆయనకు బేషరతుగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు మియా మస్క్. ఇదిలా ఉండగా మియా మస్క్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇందుకు సంబంధించి తన కొడుకుతో కలిసి ఉన్న ఫోటోను మియా మస్క్ షేర్ చేసింది.