BUSINESSTECHNOLOGY

స్టీవ్ జాబ్స్ గ్రేట్ – ఎలోన్ మ‌స్క్

Share it with your family & friends

నాయ‌క‌త్వ నైపుణ్యం గొప్ప‌ది

అమెరికా – ప్ర‌పంచ వ్యాపార దిగ్గ‌జం టెస్లా చైర్మ‌న్, ఎక్స్ చీఫ్ , స్పేస్ ఎక్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎలోన్ మ‌స్క్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఎక్స్ వేదిక‌గా ఆయ‌న అరుదైన వీడియోను షేర్ చేశారు. నాయ‌క‌త్వ నైపుణ్యం ఎలా వ‌స్తుందో తెలుసు కోవాలని అనుకుంటే ముందుగా యాపిల్ సృష్టిక‌ర్త స్టీవ్ జాబ్స్ ను చూసి నేర్చు కోవాల‌ని పేర్కొన్నారు.

స్టార్ట‌ప్ ఆర్కైవ్ ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు ఎలోన్ మ‌స్క్. ఓ సంద‌ర్బంలో ఎలా స‌క్సెస్ అవుతార‌నే దానిపై స్టీవ్ జాబ్స్ పంచుకున్న అభిప్రాయాల‌ను గుర్తు చేశారు.

గొప్ప వ్యక్తులు స్వీయ నిర్వహణలో ఉంటారు. వాటిని నిర్వహించాల్సిన అవసరం లేదు. వారు ఏమి చేయాలో తెలుసుకున్న తర్వాత, వారు దానిని ఎలా చేయాలో తెలుసుకుంటారు… వారికి కావలసింది ఒక సాధారణ దృష్టి, అదే నాయకత్వం. నాయకత్వం అనేది ఒక దృష్టిని కలిగి ఉండటం, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు దానిని అర్థం చేసుకోగలిగేలా స్పష్టంగా చెప్పగలగడం, ఉమ్మడి దృష్టిపై ఏకాభిప్రాయాన్ని పొందడం అని పేర్కొన్నారు.

ఆలోచ‌న‌లు క‌లిగి ఉండ‌డం, వాటిని ఆచ‌ర‌ణ‌లోకి తీసుకు రావాల‌ని అనుకోవ‌డం అనేది పెద్ద టాస్క్ గా భావించ వ‌ద్ద‌ని అన్నారు ఎలోన్ మ‌స్క్. నాయ‌క‌త్వ నైపుణ్యం గురించి తెలుసు కోవాల‌ని అనుకుంటే స్టీవ్ జాబ్స్ ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని సూచించారు.