అమెరికా భవిష్యత్తు కోసం ప్రచారం – ఎలోన్ మస్క్
డొనాల్డ్ ట్రంప్ గెలవక పోతే చాలా కష్టం
అమెరికా – ప్రముఖ వ్యాపార దిగ్గజం, టెక్కీ , టెస్లా చైర్మన్, ఎక్స్ సీఈవో, ఎండీ ఎలోన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కొందరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, తమ మద్దతు ఎవరికి ఇస్తామనేది వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుందన్నారు ఎలోన్ మస్క్.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఆయన ముందు నుంచీ బేషరతుగా అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించాడు. కేవలం ఆయన కోసమే , తనను బ్యాన్ చేసిన ట్విట్టర్ ను ఏరికోరి తీసుకున్నాడు. దానిని ఎక్స్ గా మార్చేశాడు. ప్రస్తుతం గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఎలోన్ మస్క్.
తాను వ్యాపారవేత్తనని, అయితే ముందు అమెరికన్ అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉండ కూడదని, రాకూడదని నాకు తెలుసు. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రచారం చేయాల్సి వస్తోందని చెప్పారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించు కోవాలని సూచించారు. ఒకవేళ ట్రంప్ గనుక ఈసారి గెలవక పోతే అమెరికా భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.