NEWSINTERNATIONAL

అమెరికాను ఏక‌ప‌క్ష రాష్ట్రంగా మార్చే కుట్ర

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఎక్స్ సీఈవో ఎలోన్ మ‌స్క్

అమెరికా – టెస్లా చైర్మ‌న్, ఎక్స్ సీఈవో, ఎండీ ఎలోన్ మ‌స్క్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్రెసిడెంట్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ క‌మ‌లా హారీస్ పై నిప్పులు చెరిగారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ట్రంప్ కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేప‌ట్టారు.

అమెరికాను ఏకపక్ష రాష్ట్రంగా మార్చడానికి ఉద్దేశ పూర్వక ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. జోసెఫ్ బైడెన్ , కమలా పరిపాలనలో నేను చూస్తున్నది అమెరికా శాశ్వత ఏక-పక్ష రాజ్యంగా మారేలా చూసేందుకు, పెన్సిల్వేనియా వంటి స్వింగ్ స్టేట్‌లలోకి వీలైనంత ఎక్కువ మందిని దిగుమతి చేసుకోవడానికి ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌న్నారు ఎలోన్ మ‌స్క్.

డెమోక్ర‌ట్లు ఓట‌ర్ల‌ను దిగుమ‌తి చేసుకుంటున్నార‌ని ఆరోపించారు. ఆధారాల‌తో స‌హా తాము బ‌య‌ట పెడుతూనే ఉన్నామ‌ని అన్నారు. కానీ దీనిని క‌ప్పి పుచ్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు ఎలోన్ మ‌స్క్.

అది ఒక పార్టీ రాష్ట్రం. కాలిఫోర్నియా ఒక సూపర్ మెజారిటీ డెమోక్రటిక్ రాష్ట్రం. కాబట్టి, ఇది ఏకపక్ష పాలన. మీకు ఒకే పార్టీ పాలన ఉంటే అది ప్రజాస్వామ్యం కానే కాద‌న్నారు . దీనిని తాము హ‌ర్షించ బోమంటూ పేర్కొన్నారు.