డొనాల్డ్ ట్రంప్ కు వ్యాపారవేత్తల మద్దతు
సంచలన కామెంట్స్ చేసిన ఎలోన్ మస్క్
అమెరికా – అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బహిరంగంగానే మద్దతు ప్రకటించారు వ్యాపార దిగ్గజం టెస్లా చైర్మన్, ఎక్స్ సీఈవో, ఎండీ ఎలోన్ మస్క్. గతంలో కంటే ఇప్పుడు ట్రంప్ కు రాను రాను మద్దతు పెరుగుతోందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా సపోర్ట్ ఏస్తున్నారని అన్నారు.
చాలా మంది వ్యాపారవేత్తలు ట్రంప్‌కు రహస్యంగా మద్దతు ఇస్తారని, అయితే ఈ విషయాన్ని వారు బహిరంగంగా చెప్పాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఈసారి జరగబోయే ఎన్నికలు అమెరికా భవిష్యత్తుకు సంబంధించినవని , మీ విలువైన ఓటును జాగ్రత్తగా వాడాలని పిలుపునిచ్చారు ఎలోన్ మస్క్.
తాను చాలా మంది వ్యక్తులతో, వ్యాపార, వాణిజ్యం , సాంకేతికత రంగాలకు చెందిన నాయకులతో మాట్లాడానని అన్నారు . అమెరికాలోనే ఎక్కువగా ప్రపంచాన్ని శాసించే కంపెనీలు ఉన్నాయని చెప్పారు మస్క్.
వారంతా తనతో ఏకీభవిస్తారని, కానీ బయటకు చెప్పేందుకు, ట్రంప్ కు మద్దతు ఇస్తున్నామని తెలిపేందుకు లోలోపట భయాందోళనకు గురవుతున్నారని అన్నారు టెక్ దిగ్గజం. ఇదిలా ఉండగా శాన్ ఫ్రాన్సిస్కో లో జరిగిన ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు వ్యాపారవేత్త ఎలోన్ మస్క్.