ప్రభుత్వ వ్యయం ద్రవ్యోల్బణానికి కారణం
నిప్పులు చెరిగిన టెస్లా చైర్మన్ ఎలాన్ మస్క్
అమెరికా – టెస్లా చైర్మన్, ఎక్స్ సీఈవో, స్టార్ లింక్ ఫౌండర్ అండ్ చీఫ్ ఎలాన్ మస్క్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఎక్స్ వేదికగా బైడెన్ ను, కమలా హారీస్ ను ఏకి పారేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లిందని మండిపడ్డారు. దీనికి ప్రధాన కారణం గత ప్రభుత్వ నిర్వాకమేనంటూ ఫైర్ అయ్యారు. అసంబద్ద నిర్ణయాల వల్ల ఇవాళ యుఎస్ తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా ప్రయాణం చేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఉన్న అమెరికా రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు ఎలాన్ మస్క్. అదనపు ప్రభుత్వ వ్యయం ద్రవ్యోల్బణానికి కారణం అంటూ నిప్పులు చెరిగారు ఎలాన్ మస్క్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
ఇది ఆదాయపు పన్ను వంటి ప్రత్యక్ష పన్ను లేదా ద్రవ్య సరఫరాను పెంచడం వల్ల ద్రవ్యోల్బణం ద్వారా పరోక్షంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం కొత్తగా కొలువు తీరే డొనాల్డ్ ట్రంప్ సర్కార్ లో కీలకమైన పాత్ర పోషించనున్నారు ఎలాన్ మాస్క్. ఇప్పటికే ఇదే సంకేతాన్ని ఇచ్చారు నూతన అధ్యక్షుడు.