ట్రంప్ కే స్వతంత్ర ఓటర్ల మద్దతు
ప్రకటించిన ఎక్స్ సీఈవో ఎలోన్ మస్క్
అమెరికా – టెస్లా చైర్మన్, ఎక్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ ఎలోన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి డొనాల్డ్ ట్రంప్ గెలవడం ఖాయమని జోష్యం చెప్పారు. ఆయన బేషరతుగా ట్రంప్ కే మద్దతు ఇస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాను వ్యాపారవేత్త అయినప్పటికీ తన సపోర్ట్ మాత్రం ట్రంప్ కే ఉంటుందన్నారు.
ఆయన ఇదే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ , ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ లను ఏకి పారేస్తున్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ కేవలం మాటలమే పరిమితమైందని అంటూ ప్రస్తుత బైడెన్ సర్కార్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎలోన్ మస్క్.
ఇదిలా ఉండగా గతంలో బైడెన్ కు మద్దతు పలికిన స్వతంత్ర ఓటర్లు ఈసారి గంపగుత్తగా డొనాల్డ్ ట్రంప్ వైపు మళ్లారని, వారంతా ఆయన వెనుక ఉన్నామంటూ ప్రకటించారు. అమెరికన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మెరుగైన జీవితం, దేశం బాగు పడాలంటే తప్పనిసరిగా ట్రంప్ ను ఎన్నుకోవాలని లేక పోతే భవిష్యత్తు ఉండదన్నారు ఎలోన్ మస్క్.