సక్సెస్ కు దగ్గరి దారులు లేవు
స్పష్టం చేసిన ఎలోన్ మస్క్
అమెరికా – ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచ కుబేరులలో టాప్ లో కొనసాగుతున్నారు టెస్లా చైర్మన్, స్పేస్ ఎక్స్ ఫౌండర్, ఎక్స్ (ట్విట్టర్) మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎలోన్ మస్క్. తను మోస్ట్ పాపులర్ టెక్కీగా కూడా పేరు పొందాడు. ఇది పక్కన పెడితే నిత్యం ఏదో ఒక దానిని కనుగొనే ప్రయత్నంలో ఉండటం ఆయనకు అలవాటు. ఈ మధ్యన తను వైరల్ గా , సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతూ వస్తున్నారు. దీనికి కారణం లేక పోలేదు. అదేమిటంటే యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు.
తాను బహిరంగంగా రిపబ్లికన్ పార్టీకి మద్దతు పలికాడు. డొనల్డ్ ట్రంప్ గెలిచేందుకు శాయ శక్తులా ప్రయత్నం చేశాడు. ఆపై ఆయన వెనుక ఉంటూ ప్రచారం చేశాడు. ఇది యావత్ వ్యాపార ప్రపంచాన్ని, వ్యాపారవేత్తలను విస్తు పోయేలా చేసింది.
ప్రధానంగా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న అమెరికాను తిరిగి రక్షిస్తామని, తమను నమ్మాలని ప్రకటించాడు. అనుకున్నట్టుగానే ట్రంప్ భారీ విజయం సాధించాడు. ఇప్పుడు ట్రంప్ కీలకమైన పాత్ర పోషించనున్నాడు ప్రస్తుత డొనాల్డ్ ప్రభుత్వంలో.
ఇది పక్కన పెడితే తాను స్థాపించిన స్పేస్ ఎక్స్ ఇప్పుడు మరో మైలు రాయిని దాటింది. ఇక్కడి నుంచి విజయవంతంగా కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపిస్తుండడం విశేషం. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్. విజయానికి దగ్గరి దారులు లేవని స్పష్టం చేశాడు ఎలోన్ మస్క్. కష్ట పడండి..అందరికంటే భిన్నంగా ఆలోచించండి అని సూచించాడు.