పతనం అంచున అమెరికా – ఎలోన్ మస్క్
డొనాల్డ్ ట్రంప్ ను గెలిపిస్తేనే భవిష్యత్తు
అమెరికా – ప్రపంచ వ్యాపార దిగ్గజం, టెస్లా చైర్మన్, ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. విస్తృతంగా పర్యటిస్తూ అధ్యక్ష బరిలో నిలిచిన మాజీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ కు బేషరతుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన వ్యాపారవేత్తనే కాదు అద్భుతమైన సాంకేతిక పరంగా అనుభవం కలిగిన టెక్కీ కూడా .
ఈ సందర్బంగా ఎలోన్ మస్క్ మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ గనుక గెలవక పోతే అమెరికా పూర్తిగా అంధకారంలోకి వెళుతుందని అన్నారు. ఆయన రాకతోనే మన భవిష్యత్తు మరింత మెరుగవుతుందని స్పష్టం చేశారు. బైడన్ రాకతో యుఎస్ భవితవ్యం అగమ్య గోచరంగా మారిందని ఆరోపించారు ఎలోన్ మస్క్.
తనది అమెరికా కాదని, కానీ తనకు ఈ ప్రాంతం పట్ల అపరిమితమైన ప్రేమ దాగి ఉందన్నారు . నేను ఆఫ్రికాలో పుట్టాను. కాబట్టి తాను అధ్యక్షుడిని కాలేనని చెప్పారు ఎలోన్ మస్క్. అయితే తాను రాకెట్లు, కార్లను తయారు చేసే పనిలో ఉన్నానని చెప్పారు.
ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే సాంకేతికతలను సృష్టించడం నాకు చాలా ఇష్టం అన్నారు . కాబట్టి మనం ట్రంప్‌ను ఎన్నుకుంటామని తాను ఆశిస్తున్నానని, అమెరికా పతనమైతే తాను రాజకీయాల్లో ఉండ లేనంటూ సంచలన ప్రకటన చేశారు ఎలోన్ మస్క్.