బైడెన్ సర్కార్ పై మస్క్ కన్నెర్ర
డొనాల్డ్ ట్రంప్ ను గెలిపించండి
అమెరికా – ప్రముఖ వ్యాపార దిగ్గజం, టెస్లా చైర్మన్, ఎక్స్ సీఈవో ఎలోన్ మస్క్ నిప్పులు చెరిగారు. అమెరికా సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న మాజీ యుఎస్ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ జరిగిన ఎన్నికల క్యాంపెయిన్ లో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.
ప్రజలు కట్టే పన్నుల ద్వారానే ప్రభుత్వం నడుస్తోందని, కానీ దుబారా ఖర్చులు చేయడం వల్ల తిరిగి అమెరికన్లపై భారం పడుతుందని మండిపడ్డారు ఎలోన్ మస్క్. ఇలాగే దుబారా ఖర్చులు పెట్టుకుంటూ పోతే చివరకు ఖజానా ఖాళీ అయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు .
ఈ సందర్బంగా వెంటనే ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించు కోవాలని డిమాండ్ చేశారు. వాస్తవమేమిటంటే, ప్రభుత్వ ఖర్చులన్నీ వాస్తవానికి పన్ను విధింపుతో కూడుకున్నవేనని పేర్కొన్నారు ఎలోన్ మస్క్.
కొన్నిసార్లు ప్రజలు అందులో కొంత పన్ను విధించ బడతారని, కొన్ని కాదు అనికుంటారని పేర్కొన్నారు . కానీ అదంతా పన్ను విధింపు, ఎందుకంటే పన్ను రాబడి పరిధి లోకి రాని భాగం ద్రవ్యోల్బణం అవుతుందన్నారు.
కాబట్టి మీరు పన్ను విధించబడతారు. నేరుగా లేదా మీరు ద్రవ్యోల్బణంతో పన్ను విధించ బడతారని హెచ్చరించారు . ప్రభుత్వ ఖర్చులన్నీ పన్ను విధింపుగా ఉంటాయి అన్ని ఫెడరల్ పన్ను ఆదాయంలో 23 శాతం వడ్డీ చెల్లింపులు రక్షణ శాఖ బడ్జెట్‌ను మించి పోయాయని హెచ్చరించారు ఎలోన్ మస్క్.