ఫిజిలో స్టార్ లింక్ కు శ్రీకారం
ప్రపంచ మార్కెట్ లో సంచలనం
ఫిజి – టెస్లా చైర్మన్, ట్విట్టర్ సీఈవో సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆటో మొబైల్స్ రంగంతో పాటు సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతోంది ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్. ఎవరూ ఊహించని రీతిలో భారీ ధరకు కొనుగోలు చేశాడు.
అందరిని విస్తు పోయేలా చేశాడు ఎలోన్ మస్క్. తను చేపట్టని రంగం అంటూ ఏదీ లేదు. ప్రస్తుతం ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వాలనేది తన లక్ష్యం. ఈ మేరకు స్టార్ లింక్ పేరుతో కంపెనీని స్టార్ట్ చేశాడు. అంతే కాకుండా మొబైల్స్ తయారీని కూడా ప్రారంభించాడు. తను పట్టిందల్లా బంగారమే.
మొదటి నుంచీ టెక్నికల్ గా ఎక్స్ పర్ట్ కావడంతో అన్నింటిని తనే దగ్గరుండి చూసుకుంటాడు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా, కుబేరుడిగా పేరు పొందిన ఎలాన్ మస్క్ తాజాగా తన స్టార్ లింక్ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోతున్నాడు.
తాజాగా గురువారం ఫిజీ దేశంలో స్టార్ లింక్ ను స్టార్ట్ చేశాడు. ఈ కార్యక్రమంలో ఆ దేశానికి చెందిన అధ్యక్షుడితో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు.