ఎలోన్ మస్క్ వైరల్
డబ్బుంది ఏం చేయాలి
అమెరికా – ప్రపంచ కుబేరుడు , టెస్లా చైర్మన్ , ట్విట్టర్ ఎక్స్ చైర్మన్ అండ్ సిఇఓ ఎలోన్ మస్క్ చర్చనీయాంశంగా మారారు. ఆయన ప్రతి రోజూ ఏదో ఒక అంశం గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. రోజు రోజుకు ట్విట్టర్ లో పెను మార్పులు తీసుకు వచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతోంది ఈ సామాజిక మాధ్యమం.
ఇది పక్కన పెడితే టెస్లా సంస్థ ద్వారా ఎలక్ట్రిక్ కార్ల తయారీలో నెంబర్ వన్ గా ఉన్న ఎలాన్ మస్క్ రోజు రోజుకు మరింత ధనవంతుడిగా మారుతున్నారు. తను ఆటోమొబైల్స్ రంగంతో పాటు సోషల్ మీడియా, ఇంటర్నెట్ కనెక్టివిటీ పై కూడా కన్నేసి ఉంచాడు. ఇప్పటికే ఇండియా పీఎం మోదీతో కూడా భేటీ అయ్యారు.
ఒకవేళ మస్క్ గనుక భారత్ లో తన వ్యాపారాన్ని గనుక విస్తరిస్తే ఇతర కంపెనీలకు బిగ్ షాక్ ఇవ్వక తప్పదని ప్రచారం కూడా లేక పోలేదు. తాజాగా ఎలాన్ మస్క్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. కారణం ఏమిటంటే ఆయన నోట్ల కట్టల మీద కూర్చుని ఉన్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. తన వద్ద లెక్కించ లేనంత డబ్బుందని వీటితో తాను ఏ కంపెనీ కొనుగోలు చేయాలని ప్రశ్నించారు నెటిజన్లను.