గనుల పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి
పిలుపునిచ్చిన మల్లు భట్టి విక్రమార్క
అమెరికా – తెలంగాణ రాష్ట్రంలో గనుల పరిశ్రమల అభివృద్దికి తోడ్పాటు ఇవ్వాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఆయన అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బగా మైనింగ్ ఎక్స్ పో 2024లో పాల్గొన్నారు.
మైనింగ్ పరికరాల తయారీదారుల ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశమైన లాస్ వెగాస్‌లోని ఎక్స్ పోలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు మల్లు భట్టి విక్రమార్క.
ఈవెంట్ లో తాజా మైనింగ్ ఆవిష్కరణలు, సాంకేతికతలు, యంత్రాలను ప్రదర్శించడం అభినందనీయమని పేర్కొన్నారు. పరిశ్రమ నిపుణులతో నెట్‌వర్క్‌కు అవకాశాలను అందించిందని తెలిపారు. 125 కంటే ఎక్కువ దేశాల నుండి 44,000 మంది నిపుణులు హాజరయ్యారు ఈ ఎక్స్ పో లో.
వారందరినీ కలవడం, వారి అనుభవాలను పంచు కోవడం, ఆలోచనలు ఇచ్చి పుచ్చు కోవడం మరింత సంతోషం కలిగిస్తోందని స్పష్టం చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.
తెలంగాణ రాష్ట్రంలోకి సంభావ్య పెట్టుబడులను సులభతరం చేయడంలో అమెరికా ఆసక్తిని వ్యక్తం చేసిందన్నారు. అభివృద్ధిని ప్రోత్సహించే స్థిరమైన సాంకేతిక జోక్యాలకు ఇరుపక్షాలు కట్టుబడి ఉంటే భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తుందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం.