విజయ సాయి రెడ్డితో లింకు లేదు
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి
అమరావతి – ఎట్టకేలకు నోరు విప్పింది ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె. శాంతి. గత కొన్ని రోజులుగా ఆమె హాట్ టాపిక్ గా మారారు. తనకు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డికి మధ్య వివాహేతర సంబంధం ఉందంటూ చేసిన ఆరోపణలను కొట్టి పారేశారు. దీనిని ఖండించారు.
మాజీ భర్త మదన్ మోహన్ చేసిన కామెంట్స్ ను కొట్టి పారేశారు కె. శాంతి. తనతో విడి పోయానని, 2000 సంవత్సరంలో సుభాష్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నానని చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ వివాహం అనంతరం తమకు ఓ బాబు పుట్టాడని తెలిపింది .
తనకు విజయ సాయి రెడ్డితో లింకు లేదని , ఆయన కూతురు వయసు ఉన్న తనపై తన మాజీ భర్త మదన్ మోహన్ నీచాతి నీచంగా విమర్శలు చేయడం దారుణమన్నారు కె. శాంతి. విడాకులపై ఒప్పంద పత్రం చేసుకున్నామని తెలిపారు. తన ప్రస్తుత భర్త గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ కు కూడా ఇది రెండో పెళ్లి అని చెప్పారు.
తనకు తన మాజీ భర్తకు మధ్య ఆర్థిక పరమైన వ్యవహారాలు ఉన్నాయని, వాటి వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. తాను ఒక ఎస్టీ మహిళను కాబట్టే తనను టార్గెట్ గా చేసుకుని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కె. శాంతి.