ప్రమాణ స్వీకారం చేసిన కె. రామ చంద్ర మోహన్
తిరుమల – టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కమిషనర్ (ఎఫ్ఏసీ) కె.రామచంద్రమోహన్ ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. కె.రామచంద్రమోహన్ కు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో ప్రశాంతి, పేష్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్బంగా స్వామి వారు తనకు భక్తులకు సేవ చేసేందుకు కల్పించిన అద్భుతమైన అవకాశంగా పేర్కొన్నారు.