అనూహ్య రీతిలో అపజయం
హైదరాబాద్ – నిన్నటి దాకా పలు విజయాలతో జోష్ మీదున్న రోహిత్ సేనకు కోలుకోలేని షాక్ తగిలింది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించినా రెండో ఇన్నింగ్స్ లో కుప్ప కూలింది. ప్రధానంగా ఇంగ్లండ్ బౌలింగ్ దెబ్బకు భారత బ్యాటర్లు విల విల లాడారు.
బౌలింగ్, బ్యాటింగ్ పరంగా తీవ్ర నిరాశకు గురి చేసింది భారత జట్టు. పేరుకు బలమైన ప్లేయర్లు ఉన్నా చివరకు చేతులెత్తేశారు. 28 రన్స్ తో చరిత్రాత్మక విజయం సాధించారు. ఓలీ పోప్ బ్యాటింగ్ లో చెలరేగితే హార్టీ అద్భుతమైన బౌలింగ్ తో దెబ్బ కొట్లారు. దీంతో ఠారెత్తి పోయారు భారతీయ బ్యాటర్లు.
విచిత్రం ఏమిటంటే ముందు నుంచీ భారత జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇండియా తప్పకుండా గెలుపొందింది. చివరి దాకా పోరాడాంది ఇంగ్లండ్ జట్టు. ఆ టీమ్ ను ప్రశంసించి తీరాల్సిందే. దీంతో ఇంగ్లండ్ ఐదు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.
ఓటమి అంచుల నుంచి గెలుపు తీరాల దాకా చేర్చడంలో ఇంగ్లండ్ ప్లేయర్ల కృషికి ఫిదా కావాల్సిందే.