Friday, April 4, 2025
HomeDEVOTIONALశ్రీ‌వారి ప‌ర‌కామ‌ణి లెక్కింపులో అవ‌క‌త‌వ‌క‌లు

శ్రీ‌వారి ప‌ర‌కామ‌ణి లెక్కింపులో అవ‌క‌త‌వ‌క‌లు

సీనియ‌ర్ అసిస్టెంట్ ను స‌స్పెండ్ చేసిన ఈవో

తిరుప‌తి – టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. చెన్నైలోని టీటీడీ శ్రీవారి ఆలయంలో పరకామణిలో లెక్కింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయి. శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకల్లో చేతివాటం ప్రదర్శించారు టీటీడీలో ప‌ని చేస్తున్న కృష్ణ‌కుమార్. హుండీ లెక్కింపులో విదేశీ కరెన్సీని స్వాహా చేసిన‌ట్లు గుర్తించారు. గత సంవత్సరం ఒక నెలలో రూ. 6 లక్షల విదేశీ కరెన్సీ ని దొంగిలించాడ‌ని తేలింది. దీంతో త‌న‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు ఈవో జె. శ్యామ‌ల రావు.
ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తి రోజూ భ‌క్తులు స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల‌ను లెక్కించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఇందు కోసం ప్ర‌త్యేకంగా ప‌రకామ‌ణి పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. నిత్యం సీసీ కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుంది. ఇందుకోసం ప్ర‌త్యేక‌మైన భ‌ద్ర‌తా ఉంటుంది. హుండీలో వచ్చిన విదేశీ కరెన్సీని ప్రతి నెల 1వ తేది తిరుమల పరకామణిలో జమ చేయాలి. విదేశీ కరెన్సీ లెక్కింపులో తేడాలు జరిగినట్లు గుర్తించింది టీటీడీ విజిలెన్స్ వింగ్. టీటీడీలో సీనియర్ అసిస్టెంట్ గా ప‌ని చేస్తున్న కృష్ణ కుమార్ అవకతవకలకు పాల్పడినట్లు తేల్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదిక‌ను టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావుకు అందించారు. నివేదిక ఆధారంగా కృష్ణ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments