Sunday, April 20, 2025
HomeDEVOTIONALశ్రీవారి కాలిబాట భక్తులకు టీటీడీ విన్న‌పం

శ్రీవారి కాలిబాట భక్తులకు టీటీడీ విన్న‌పం

రోగాలు ఉన్న వారు మెట్లు ఎక్క‌వ‌ద్ద‌ని సూచ‌న‌

తిరుమల – ఇటీవలి కాలంలో తిరుమలకు కాలి నడకన వస్తున్న భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పలు సూచనలు చేస్తోంది.

1.⁠ ⁠60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదు.

2.⁠ ⁠ఊబకాయంతో బాధ పడుతున్న భక్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తిరుమల కొండకు నడక దారిన రావడం శ్రేయస్కరం కాదు.

3.⁠ ⁠తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. కాలి నడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బస వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. కనుక భక్తులు తదనగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

4.⁠ ⁠దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న భక్తులు వారి రోజువారి మందులు వెంట తెచ్చుకోవడం ద్వారా సమస్యలను నివారించవచ్చు.

5.⁠ ⁠కాలి నడకన వచ్చే భక్తులకు ఏమైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చని తెలిపింది టీటీడీ.

6.⁠ ⁠తిరుమలలోని ఆశ్వినీ ఆసుపత్రి, ఇతర వైద్యశాలల్లో 24×7 వైద్య సదుపాయం పొందవచ్చని పేర్కొంది.

7.⁠ ⁠దీర్ఘకాలిక కిడ్ని వ్యాధి గ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపింది టీటీడీ.

తిరుమలకు కాలినడకన రాదలచిన భక్తులు పై సూచనలను తప్పనిసరిగా పాటించి సహకరించ వలసినదిగా టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments