తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె. శ్యామల రావు
తిరుపతి – ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఈవో జె. శ్యామలరావు వెల్లడించారు. ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా 11న సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న గ్యాలరీలలో భక్తులు సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 క్యూయేస్క్ లు (కౌంటర్లు) ఏర్పాటు చేశామన్నారు. ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణం, అన్న ప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టామన్నారు.
ఆలయ ప్రాంగణంలో నడిచే భక్తులకు ఎండ వేడి ఉపసమనం కొరకు ఆలయ నాలుగు మాడ వీధులలో వైట్ పెయింట్ వేశామన్నారు. ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేందుకు, క్యూ లైన్లలో వెళ్ళెందుకు జర్మన్ షెడ్డు ఏర్పాటు చేశామని తెలిపారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉండే భక్తులతో పాటు, కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా ఈ ఏడాది భక్తుల సౌలభ్యం కొరకు అత్యాధునిక టెక్నాలజితో 21 ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆలయం , కల్యాణ వేదిక, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ కాంతులతో 38 వివిధ దేవతామూర్తుల ప్రతిమలు, భక్తులు సులువుగా గుర్తించేదెలా సూచిక బోర్డులు ఏర్పాటు చేశామని చెప్పారు. టిటిడి విజిలెన్స్ విభాగం నుండి 350 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం నుండి 2500 మంది భద్రతా సిబ్బందితో పటిష్ట భద్రత.
అదేవిధంగా 130 సిసి కెమెరాలు, 20 డ్రోన్ లు ఏర్పాటు చేశామన్నారు. 4 ఫైర్ ఇంజన్లు, ఒక అత్యవసర వాహనాలతో పాటు అత్యవసర సేవలందించేందుకు ఫైర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంల ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈవో.
శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ ప్రాంగణంలో, కల్యాణ వేదిక వద్ద అన్నప్రసాద వితరణ చేపడతామన్నారు. కల్యాణాన్ని వీక్షించేందుకు గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు సాయంత్రం నుండి లెమన్ రైస్, చక్కర పొంగలి, బిస్కెట్ ప్యాకెట్, కారాసు అందిస్తామన్నారు. బ్రహ్మోత్సవాలకు దాదాపు 3 లక్షల తాగునీరు బాటిల్స్, వాటర్ టబ్బుల ద్వారా నీటి సరఫర, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తామన్నారు శ్యామల రావు.
ఆర్‌టిసి ద్వారా కడప నుండి ఒంటిమిట్ట వరకు 85 బస్సులతో 425 ట్రిప్పులు, రాజంపేట నుండి ఒంటిమిట్ట వరకు 40 బస్సులతో మొత్తం 625 ట్రిప్పుల ద్వారా భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాల నుండి కల్యాణ వేదిక వరకు 20 బస్సులు ఏర్పాటు చేశామన్నారు.
కల్యాణ వేదిక, ఆలయం, పరిసర ప్రాంతాల్లో 12 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ తో పుష్పాలంకరణలు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మొదటిసారి ఆలయ ప్రాంగణంలో కళా కృతులుతో సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేశామన్నారు.
శ్రీ సీతా రాముల కల్యాణంలో గోవిందనామ సరళిలో శ్రీ రామనామ భజనామృతం. హెచ్ డిపీపీ – (18), దాస సాహిత్య ప్రాజెక్టు (4,) అన్నమాచార్య ప్రాజెక్టు (8) ఆధ్వర్యంలో మొత్తం 30 కళా బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 13 వైద్య శిబిరాలు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 8 అంబులెన్స్ లు, అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
కళ్యాణ వేదిక ఆలయ పరిసరాలలో 250 మరుగుదొడ్లు, టిటిడి జిల్లా యంత్రాంగం సమన్వయంతో 3,268 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తారని చెప్పారు ఈవో.
500 మంది టీటీడీ డిప్యూటేషన్ ఉద్యోగులు, 2500 మంది శ్రీవారి సేవకులు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తారని తెలిపారు. ఈ ఏడాది సీతారాముల కల్యాణోత్సవంలో విధులు నిర్వహించే సిబ్బందికి నాలుగు సార్లు తిరుపతి శ్వేత భవనంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా హెచ్‌డి క్యాలిటీతో ప్రత్యక్ష ప్రసారం అందిస్తామన్నారు.