DEVOTIONAL

పీఏసీ-3లో లాకర్ కేటాయింపు కౌంటర్ ప్రారంభం

Share it with your family & friends

ప్రారంభించిన టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు

తిరుమల – తిరుమల లోని యాత్రికుల వసతి సముదాయం-3లో కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ ను టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ప్రారంభించారు.

పీఏసీ-3లో లాకర్ కేటాయింపునకు మూడు కౌంటర్ లను ఏర్పాటు చేశారు. భ‌క్తులు గంద‌ర‌గోళానికి గురికాకుండా ఇక‌పై ఒకే చోట లాక‌ర్ల‌ను కేటాయిస్తారు. ఇక్కడ భక్తుల కోసం 1420 లాకర్లు అందుబాటులో ఉంటాయి. గదులు దొరకని భక్తులు అసౌకర్యం కలగకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

అనంత‌రం తిరుమ‌ల‌లో నిర్మాణంలో ఉన్న పీఏసీ-5 భ‌వ‌నాన్ని ఈవో ప‌రిశీలించారు. నిర్మాణ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ భ‌వ‌నంలో భ‌క్తులకు అన్ని ర‌కాల మౌలిక స‌దుపాయాలు ఏర్పాటు చేయాల‌న్నారు.

అక్క‌డి నుంచి త‌రిగొండ వెంగ‌మాంబ అన్న ప్ర‌సాద కేంద్రానికి చేరుకుని డోనార్ సెల్ ను ప‌రిశీలించారు. భ‌క్తులు విరాళం ఇచ్చేందుకు నూత‌నంగా ప్రారంభించిన కియోస్క్ మిష‌న్ త‌నిఖీ చేసి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ సిఈ స‌త్యనారాయ‌ణ‌, ఈ ఈ వేణుగోపాల్ , డి ఈ చంద్ర శేఖర్ అన్నదానం అధికారులు రాజేంద్ర, శాస్త్రి,డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, వీజీవో సురేంద్ర‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.