టీటీడీ ఈఓ శ్యామలరావు వెల్లడి
తిరుమల – స్విమ్స్ ద్వారా మరిన్ని వైద్య సేవలందించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించిందని వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. రిటైర్డ్ ఐఏఎస్ ఐవి సుబ్బారావ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు మేరకు స్విమ్స్ ను అభివృద్ధి చేస్తామన్నారు. వివిధ విభాగాలకు సంభందించి 597 పోస్టులు భర్తీ చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీవారి వైద్యసేవ ద్వారా ఆసక్తి ఉన్న వాలంటీర్స్ ద్వారా స్విమ్స్ లో సేవలు ప్రారంభిస్తామన్నారు. టీటీడీలోని 29 మంది అన్యమత ఉద్యోగులకు విఆర్ఎస్ ఇచ్చి పంపిస్తామని, .రిటైర్డ్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మఠాల ఆక్రమణలపై పరిశీలన జరుగుతుందన్నారు.
నిభందనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈవో జె. శ్యామల రావు. శ్రీవారి ఆలయ భద్రత దృష్ట్యా యాంటి డ్రోన్ టెక్నాలజీ తీసుకు వస్తామన్నారు. ఒంటిమిట్ట ఆలయంలో త్వరలోనే అన్న ప్రసాదం వితరణ చేస్తామన్నారు. రాజధాని అమరావతి సమీపంలోని అనంతవరంలోని శ్రీవారి ఆలయాభివృద్ధికి 10 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల కొండల్లో పచ్చదనం పెంచాలన్న సీఎం అదేశానుసారం ప్రభుత్వ అటవీశాఖకు రూ 4 కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు ఈవో జె. శ్యామల రావు.
గోవింద నామలను వక్రీకరిస్తూ…ఇటీవల తమిళ సినిమా డిడి నెక్స్ట్ లెవల్ సాంగ్ రూపొందించడంపై టీటీడీ సిరియస్ అయ్యింది. ఈ మేరకు . లీగల్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీటీడీలో ఏఐ టెక్నాలజీ డెవలప్మెంట్ పై గూగుల్ టిసిఎస్ సంస్థలు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. టీటీడీలో ఉద్యోగ పదోన్నతులు అమలుకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వల్ల తలెత్తిన సమస్యలు త్వరలో పరిష్కరించి, పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. తులాభారం వివాదంపై విజిలెన్స్ విచారణ మొదలైందన్నారు.