తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
చంద్రబాబు నాయుడును కలిసిన ఈవో టీటీడీ
అమరావతి – తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో జె. శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తో పాటు శ్రీవారి అర్చకులు ఆదివారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుమల లడ్డూ కల్తీకి సంబంధించి పూర్తి నివేదికను చంద్రబాబు నాయుడుకు అందజేసినట్లు సమాచారం. అంతకు ముందు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు ఈవో , ఏఈవో.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె.శ్యామల రావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించారు.
బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అధికారులకు, పండితులకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.