Tuesday, April 22, 2025
HomeDEVOTIONALనాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి

నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి

రైస్ మిల్లర్లతో టీటీడీ ఈవో మీటింగ్

తిరుమల – తిరుమలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు అందించే అన్న ప్రసాదాల రుచిని పెంచేందుకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని టీటీడీ ఈవో జె. శ్యామల రావు రైస్ మిల్లర్లను కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీకి బియ్యం సరఫరా చేస్తున్న రైస్‌మిల్లర్లతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు బియ్యం సేకరణ సమయంలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించడంలో దోహదపడే అంశాలను ఇవ్వాలని కోరారు. తద్వారా టెండర్లకు ఆహ్వానించే సమయంలో వాటిని చేర్చేందుకు వీలు కుదురుతుంద‌ని పేర్కొన్నారు.

అన్నం రుచిని పెంపొందించేందుకు రైస్ మిల్లర్స్ పలు సూచనలు చేశారు. ఇందులో ముఖ్యంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదంలో వంట పరికరాలు దశాబ్దన్నర కాలం నాటివి కావడంతో వాటి స్థానంలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయాలని ఈవో దృష్టికి తీసుకెళ్లారు.

ఈ మేరకు ఈవో స్పందిస్తూ ఇప్పటికే టీటీడీ ఈ విషయమై ఆలోచన చేసిందని, త్వరలో వంటశాలలను ఆధునీకరించనున్నట్లు ఈవో తెలిపారు.

ఈ సమావేశంలో జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, అన్న ప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్రకుమార్, ప్రత్యేక అధికారి (కేటరింగ్) శాస్త్రి, ఈఈ ప్రొక్యూర్‌మెంట్ మురళీకృష్ణ, ఏపీ, తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments