ఈక్వెనెక్స్ డేటా సెంటర్ సూపర్ – లోకేష్
శాన్ ఫ్రాన్సిస్కో పర్యటనలో ఏపీ మంత్రి
అమెరికా – అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అయ్యారు. మరికొందరితో చర్చలు జరిపారు. ప్రధానంగా ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ చేయాలన్నది తమ లక్ష్యమని, ఇందుకు మీరందరి సహకారం కావాలని పిలుపునిచ్చారు.
ప్రవాస ఆంధ్రులు ఎక్కువగా కీలకమైన పదవులలో ఉన్నారని, మరికొందరు టాప్ కంపెనీలను స్థాపించడం తనకు మరింత సంతోషం కలిగిస్తోందన్నారు. పుట్టిన గడ్డకు ఎంతో కొంత సేవ చేయాలన్నది తమ అభిమతని, దీనేని కూటమి సర్కార్ ముందుకు తీసుకు వెళుతోందని తెలిపారు. అపారమైన వనరులు ఉన్నాయని, అంతే కాకుండా ప్రతిభా నైపుణ్యం కలిగిన యువతీ యువకులు ఉన్నారని వారికి మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు.
ఆదివారం నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రముఖ కంపెనీ ఈక్వెనెక్స్ డేటా సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్బంగా కంపెనీ పనితీరు అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు.
ఈ సందర్భంగా తమ కంపెనీ అందిస్తున్న డాటా సేవలు, కార్యకలాపాలను సంస్థ గ్లోబల్ ఎండి కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో డాటాసెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను వివరించి ఈక్వెనెక్స్ ఏపీకి రావాలని ఆహ్వానించారు.