పిలుపునిచ్చిన మంత్రి నారా లోకేష్
దావోస్ – ఆంధ్రప్రదేశ్ లో ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ప్రామాణిక గోల్ఫ్ సిటీ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా మంత్రి నారా లోకేష్ కోరారు. దావోస్ లో జరిగిన ఎకామిక్ ఫోరంలో స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ప్రతినిధులతో చర్చించారు. గ్రూపు స్ట్రాటజిక్ గ్లోబల్ అడ్వయిజర్ ఫణి శ్రీపాద, సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రతిపాదిత ప్రపంచ స్థాయి గోల్ఫ్ సిటీని ఎపిలో ఏర్పాటైతే ఏపీ ఆర్థికంగా మరింత బలపడుతుందన్నారు. దీనికి సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా ఫణి శ్రీపాద మాట్లాడుతూ ప్రపంచ క్రీడా గమ్యస్థానంగా ఏపీ మారుతుందని అన్నారు. పూర్తిస్థాయి బ్లూప్రింట్ తో వస్తే 15 రోజుల్లో ఎపి ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేస్తుందని మంత్రి లోకేష్ తెలిపారు.
తమ కూటమి ప్రభుత్వం అత్యుత్తమమైన క్రీడా పాలసీని అమలు చేస్తోందని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మెరికల్లాంటి యువతీ యువకులు ఉన్నారని, వారందరికీ అత్యున్నతమైన వసతులు కల్పిస్తామన్నారు.