Saturday, May 24, 2025
Homeఅంద‌రి స‌హ‌కారం 25 ల‌క్ష‌ల‌కు పైగా స‌భ్య‌త్వం

అంద‌రి స‌హ‌కారం 25 ల‌క్ష‌ల‌కు పైగా స‌భ్య‌త్వం

వెల్ల‌డించిన భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ పురందేశ్వ‌రి

విజ‌య‌వాడ – అంద‌రి స‌హ‌కారంతో రాష్ట్రంలో 25 ల‌క్ష‌లకు పైగా స‌భ్య‌త్వ న‌మోదు చేయ‌డం జ‌రిగింద‌న్నారు బీజేపీ చీఫ్ పురంధేశ్వ‌రి. సోమ‌వారం బీజేపీ కీల‌క స‌మావేశం జ‌రిగింది. జిల్లా నూతన అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జి ఆహ్వానితులతో భేటీ అయ్యారు. సంస్థాగత అంశాలు, రాజకీయ కార్యాచరణపై చర్చ జ‌రిగింది. ఏప్రిల్ 6 పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 14న అంబేడ్కర్ జయంతి నిర్వహణపై చర్చించారు. పోలింగ్ బూత్ స్థాయిలో ఆరు కార్యక్రమాల నిర్వహణపై నేతలకు సూచ‌న‌లు చేశారు. 21 వేల మందికి క్రియాశీలక సభ్యత్వం ఇచ్చామ‌న్నారు. 2 లక్షల 18 వేల మంది బూత్ స్థాయిల్లో కార్యకర్తలు పార్టీకి ఉన్నారని చెప్పారు.

ఈ సంద‌ర్బంగా బీజేపీ చీఫ్ ప్ర‌సంగించారు. బీజేపీకి రాష్ట్రంలోనూ ప్రజాదరణ పెరుగుతోందన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అన్నారు. డబుల్ ఇంజను సర్కార్ ద్వారా ప్రగతి సాధ్యం అవుతోందని చెప్పారు. అభివ్రద్ధికి తావు లేకుండా వైసీపీ పాలన సాగింద‌న్నారు. అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేసింద‌ని, రహదారులను అధ్వాన్న స్థితికి చేర్చిందన్నారు. విద్వేషం ఎక్కువై నోరు మెదిపితేనే అట్రాసిటీ కేసులు నమోదు చేశారన్నారు. ప్రజావేదిక కూల్చివేత విద్వేషంతో వైసీపీ తమ పాలన ప్రారంభించిందన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments