Saturday, April 26, 2025
HomeNEWSబీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌కు స‌ర్వం సిద్దం

బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌కు స‌ర్వం సిద్దం

భారీ ఎత్తున ఏర్పాటు చేసిన గులాబీద‌ళం

వ‌రంగ‌ల్ జిల్లా – ఓరుగ‌ల్లు మ‌రోసారి గులాబీమ‌యం కానుంది. ఏప్రిల్ 27న ఆదివారం 10 ల‌క్ష‌ల మందికి పైగా హాజ‌రు కానున్నారు. బీఆర్ఎస్ ఏర్ప‌డి 25 ఏళ్ల‌వుతోంది. ఈ సంద‌ర్బంగా ర‌జ‌తోత్స‌వ స‌భ‌కు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ఏర్పాట్లు చేసింది పార్టీ. 1,213 ఎక‌రాల‌లో ఈ స‌భ జ‌ర‌గ‌నుంది. 154 ఎక‌రాల్లో మ‌హా స‌భ ప్రాంగ‌ణం, 500 మంది కూర్చునేలా ప్ర‌ధాన వేదిక‌తో పాటు 1,059 ఎక‌రాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. 10 ల‌క్ష‌ల వాట‌ర్ బాటిళ్లు, 16 ల‌క్షల మ‌జ్జిగ ప్యాకెట్లు, వివిధ రూట్ల‌లో 6 అంబులెన్సులు, ప‌రిస‌రాల్లో 12 వైద్య శిబిరాలు,1,200 తాత్కాలిక మ‌రుగుదొడ్లు, పార్కింగ్ నిర్వ‌హ‌ణ‌కు 2,000 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. 2001లో టీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు. 2014లో సాధించేంత వ‌ర‌కు ఎన్నో పార్టీలు చేసింది.

అధికారంలోకి వచ్చిన తరువాత పదేండ్ల పాటు సుపరిపాలన అందించి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది. 17 నెలల క్రితం రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కేవలం 2.05 శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, స్వల్ప కాలంలోనే ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నది. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా పదిహేడు నెలల నుంచి అద్భుతంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది.

లగచర్లలో గిరిజన రైతులపై కాంగ్రెస్ చేసిన దాష్టీకాలను యావత్ దేశం దృష్టికి తీసుకుపోవడంలో బీఆర్ఎస్ విజయవంతం అయింది. మూసీ, హైడ్రా బాధితులకు అండగా నిలబడింది. మొన్నటి హెచ్‍సీయూ విద్యార్థుల పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచి 400 ఎకరాల పచ్చటి అటవీ భూమిని కాపాడుకుంది. అక్కడి వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండా చేయాలనుకున్న రేవంత్ ప్రభుత్వ దమనకాండను దేశం ముందుంచింది. త్యాగాల పునాదుల మీద అవతరించిన తెలంగాణను ఖతం పట్టించాలనుకుంటున్న కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కుంటూనే తన 25 ఏండ్ల రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది.

ఇక సభకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50 వేల వాహనాల వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్‌ కోసం 1,059 ఎకరాలను కేటాయించారు. వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు. సభకు వచ్చే ప్రజల కోసం లక్షకు పైగా కుర్చీలను ఏర్పాటు వేశారు. మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు వేసి బారికేడ్లు పెట్టారు. లైట్లు, ఎల్‌ఈడీల కోసం 200 భారీ జనరేటర్లను ఏర్పాటుచేశారు. కేసీఆర్‌ అందరికీ స్పష్టంగా కనిపించేలా 20/50 సైజుతో కూడిన 23 ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్‌ సిస్టంను చుట్టుపక్కల ఏర్పాటుచేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments