షిండే షాక్ డిప్యూటీ సీఎం డోంట్ కేర్
డిప్యూటీ సీఎం పదవి తిరస్కరణ
మహారాష్ట్ర – ఇంకా కొద్ది గంటల్లో మహారాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరనుండగా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులకు పైగా అయినప్పటికీ ఇప్పటికీ ఇంకా ఎవరు సీఎం అవుతారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇందులో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఉప ముఖ్యమంత్రులుగా షిండే, అజిత్ పవార్ ఉంటారని పేర్కొంది. ఇందుకు సంబంధించి డిసెంబర్ 5 గురువారం ముహూర్తం కూడా ఖరారు చేశారు.
కాగా ఉన్నట్టుండి ఏక్ నాథ్ షిండే కోలుకోలేని షాక్ ఇచ్చారు. తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వద్దని ప్రకటించారు. ఇదే సమయంలో తన పక్కనే ఉన్న అజిత్ పవార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో మరాఠా ప్రభుత్వ ఏర్పాటుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే బీజేపీ అధిష్టానం సీరియస్ గా చర్చలు జరిపింది.
ఇందులో ఫడ్నవీస్ తో పాటు షిండే, పవార్ పాల్గొన్నారు. అయినా క్లారిటీ రాక పోవడం విశేషం.