కాళేశ్వరం ప్రాజెక్టు బొమ్మ కాదు
మాజీ సీఎం కేసీఆర్ కామెంట్
నల్లగొండ జిల్లా – కాళేశ్వరం ప్రాజెక్టు బొమ్మ కాదని పదే పదే దాని గురించి మాట్లాడేందుకంటూ నిప్పులు చెరిగారు మాజీ సీఎం కేసీఆర్. నాగార్జునసాగర్, మూసీ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టులకు గతంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదా అని ప్రశ్నించారు. సమస్యలుంటే వాటిని పరిష్కరించాలే తప్పా విమర్శలు చేయడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు. ఈ ప్రభుత్వానికి నదులపై, నీటిపై అవగాహన లేదన్నారు.
అసెంబ్లీ తీర్మానంతో ఈ సమస్య తీరదన్నారు. రైతుబంధు అని ప్రశ్నిస్తే రైతులను పాదరక్షలతో కొట్టమని ఎలా చెబుతారని ప్రశ్నించారు. రైతుల పాదరక్షలు మీ కంటే కఠినమైనవని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎందుకు రైతు బంధు పూర్తిగా వేయలేక పోతున్నారంటూ ప్రశ్నించారు.
అధికారం అన్నది ఏ ఒక్కరికీ శాశ్వతం కాదన్నారు కేసీఆర్. తెలంగాణకు సంబంధించి నాలుగున్నర కోట్ల ప్రజల హక్కు అని గుర్తు పెట్టు కోవాలన్నారు. ఇది రాజకీయ సమావేశం కాదని ఇది ముమ్మాటికీ ప్రభుత్వంపై పొరాడేందుకు ఏర్పాటు చేసిన సభ అని ప్రకటించారు మాజీ సీఎం.
సమైక్య రాష్ట్రమే బెటర్ అంటున్నారు నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి లక్షల కోట్ల మంది ఎందుకు ఉద్యమం చేశారని ప్రశ్నించారు. ఈ జిల్లాకు చెందిన శ్రీకాంత్ ఆచారి ఎందుకు ప్రాణత్యాగం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.